దిల్-రాజు నిర్మించే చిత్రాన్ని పైడపల్లి వంశీ డైరక్ట్ చేస్తున్నాడు. ఆయన గతంలో ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని రూపొందించారు. భాక్సా ఫీస్ వద్ద పరాజయాన్ని చూసినా ఆ చిత్రంలో టెక్నికల్ గా దర్శకుడు మంచి ప్రతిభ చూపాడని పేరు వచ్చింది. దానితో ఎన్టీఅర్ 'బృందావనం' ద్వారా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ కొట్టేసాడు.
ఈ సినిమాకు సంబంధించిన సంగీత చర్చలు ప్రస్తుతం గోవాలో జరుగుతున్నాయి. దిల్‌రాజు సంస్థలో చరణ్ నటిస్తున్న తొలి సినిమా ఇది. అలాగే పైడిపల్లి వంశీతో ఆయన పనిచేయడం కూడా ఇదే ప్రథమం. ఇక చరణ్ సినిమాకు దేవిశ్రీ సంగీతాన్నందించడం కూడా ఈ సినిమాతోనే జరుగుతోంది. ఈ సినిమా త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది. ఇందులో చరణ్‌కి జంటగా సమంత నటించనున్నారని సమాచారం.
No comments:
Post a Comment