టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్…., సినిమా ఏదైనా ఐటం సాంగ్ కంపల్సరీ అయిపొయింది. సినిమా హిట్ అవ్వాలంటే అందులో ఓ ఐటం సాంగ్ ఉండాల్సిందే. అదీ మాస్ మసాలా ఉన్న సినిమా అయితే ఐటం సాంగ్ తప్పనసరి అయిపొయింది. ఇలా అందరూ ఐటం సాంగ్స్ పెడుతున్న సమయంలో వాటిలో కూడా కొత్తదనం కోసం నానా పాట్లు పడుతున్నారు కొందరు డైరక్టర్లు. ఐటం గార్ల్స్ నుంచి హీరోయిన్లే ఐటం సాంగ్స్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఈ సమయంలో ఒక హీరోయిన్ ఐటం సాంగ్ చేస్తే ఆర్డినరీగా ఉంటుంది కాబట్టి ఎక్స్ ట్రా ఆర్డినరీగా ఉండటం కోసం ముగ్గురు హీరోయిన్లు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ముగ్గురు హీరోయిన్లతో ఐటం సాంగ్ చేయబోతున్న ఆ సినిమా పేరు ” రాజపట్టా “. తమిళ్ హీరో విక్రమ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఇది. నా పేరు శివ సినిమా తీసిన సుసీంద్రన్ డైరక్టర్ ఈ సినిమాకు. భారీ మాస్ మసాలాగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీక్షా సేథ్ నటిస్తుంది. ఐటం సాంగ్ హీరోయిన్లుగా శ్రియ, రీమాసేన్ ఇప్పటికే కన్ ఫార్మ్ అయ్యారు. రీసెంట్ గా వీరిద్దరితో సలోని కూడా జాయిన్ అయ్యింది. ఈ ముగ్గురు హీరోయిన్లు విక్రమ్ తో కలిసి ఓ ఐటం సాంగ్ లో చిందేయబోతున్నారు.
No comments:
Post a Comment