ఫేస్‌బుక్‌పై విరుచుకు పడుతున్న హ్యాకర్స్
* యూజర్స్ వ్యక్తిగత సమాచారం మాయం
* ఫేస్‌బుక్ యూజర్స్‌కు కరువైన భద్రత
* హ్యాకర్స్ దాడిని ధృవీకరించిన ఫేస్‌బుక్
* సెక్యురిటీ మరింత పెంచుతామన్న ఫేస్‌బుక్
మీకు ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉందా? పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో రిజిస్టర్ చేశారా? అయితే మీరు ఇంటర్నెట్ కష్టాల్లో పడ్డట్లే. మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత సమాచారం ప్రపంచమంతా పాకిపోతుంది. ఫేస్‌బుక్ హ్యాకర్స్ బుక్‌గా మారడమే ఇందుక్కారణం. ఫేస్‌బుక్ రోజు రోజుకీ ఫేక్ బుక్‌గా మారుతోంది. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వినియోగదారులకు భద్రత కరువవుతోంది. రోజూ వేల సంఖ్యలో హ్యాకర్స్ ఫేస్‌బుక్‌పై దాడి చేయడమే ఇందుక్కారణం. ప్రతీరోజు వంద కోట్ల మంది ఫేస్‌బుక్ వాడుతున్నట్లు లెక్కల్లో తేలింది. దీంతో హ్యాకర్స్ దాడులకు ఇది అడ్డాగా మారింది.
ఇప్పటికే చాలా మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్లినట్లు నిర్థారణైంది. సాక్షాత్తు ఫేస్‌బుక్కే హ్యాకర్స్ దాడి చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త సెక్యూరిటీ పద్దతులు ప్రవేశపెడుతున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. యూజర్స్ పాస్‌వర్డ్ సెలక్షన్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హ్యాకర్స్ దాడికి చెక్ పెట్టేంత వరకు వినియోగదారులు .....
తెలిసిన ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు మాత్రమే అంగీకరించాలని ఫేస్‌బుక్ నిర్వాహకులు కోరుతున్నారు. హ్యాకర్స్‌లో చాలా మంది టీనేజర్స్ ఉన్నట్లు గుర్తించిన ఫేస్‌బుక్ భవిష్యత్తులో యూజర్స్‌కు ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.
No comments:
Post a Comment